ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 7:06 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మైత్రీ మూవీ మేకర్స్, సాయి రాజేష్ మిట్టి అండ్ మూన్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న “మైనా” మూవీ ఘనంగా ప్రారంభం

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ కొత్త నిర్మాణ సంస్థ మిట్టి అండ్ మూన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “మైనా”. ఈ సినిమాకు సాయి రాజేష్
నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివమణి పట్నంశెట్టి, గీత మహావడి, చంటి బాబు, దివ్య జయరాజ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహి ఇప్పలపెల్లి కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, చంటి
బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
“మైనా” సినిమా ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమ ప్రేమకు
ఎదురైన ఆటంకాలను దాటుకుంటూ రెండు ప్రేమ జంటలు ముందుకు వెళ్తుండటం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించడం ఆసక్తి కలిగిస్తోంది. లవ్ స్టోరీస్ రాయడంలో, ప్రొడ్యూస్ చేయడంలో తన ప్రత్యేకత
చూపించే సాయి రాజేష్ నిర్మాణంలో మరో క్రేజీ లవ్ స్టోరీగా “మైనా” సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.
నటీనటులు – శివమణి పట్నంశెట్టి, గీత మహావడి, చంటి బాబు, దివ్య జయరాజ్, తదితరులు.